ArticlesNews

ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం ఇదీ…

34views
2025 వ సంవత్సరం సంఘ కార్యశతాబ్ది సంవత్సరం. ఈ సందర్భంగా సంఘ్ సమాజంలోని అన్ని వర్గాలకూ మరింత చేరువకావడానికి రకరకాల కార్యక్రమాలను యోజన చేస్తోంది. అలాగే ‘‘పంచ పరివర్తన్’’ అనే అంశాన్ని కూడా సమాజం ముందుకు తెచ్చింది. కార్య శతాబ్ది కార్యక్రమాల కారణంగా సంఘ్ సమాజంలోకి మరింత చొచ్చుకెళ్తోంది. దీంతో ప్రజలు కూడా సంఘ్ ను అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతోంది. సంఘ్ ను అర్థం చేసుకోవడంతో పాటు ఏ కార్యక్రమం చేపట్టినా సమాజం నుంచి గట్టిగా మద్దతు కూడా లభిస్తోంది.
అయితే.. సంఘ్ లో రహస్య కార్యకలాపాలు అంటూ ఏమీ వుండవు. అంతా బహిర్గతమే. సంఘ్ ను అర్థం చేసుకోవాలంటే శాఖకు రావడమే ఏకైక మార్గం. మారో మార్గం వుండదు. శాఖకు రాని వారికి సంఘ్ రకరకాలుగా కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంసేవక్ కి వచ్చే బాధ్యతలు కూడా ముఖ్యమైనవే. అయితే.. ఆ బాధ్యతకు వుండే పేరు స్వయంసేవక్ కి బాధ్యతను పెంచుతుందే తప్పించి, అహంకారాన్ని, దర్పాన్ని తెచ్చి పెట్టదు. స్వయంసేవక్ కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తూ వుంటారు.
ఆరెస్సెస్ లో ఓ వ్యవస్థ వుంటుంది. దీని ద్వారా సంఘ్ నడుస్తుంది. అన్నింటికీ కేంద్ర బిందువు మాత్రం శాఖ, స్వయంసేవకే. అసలు ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం ఎలా వుంటుందో ఒకసారి చూద్దాం.
ప్రతి శాఖకు కూడా స్వయంసేవకుల జాబితా వుంటుంది. ఒక ప్రాంతంలో వున్న స్వయంసేవకుల సంఖ్య (నిష్పత్తి) ఆధారంగా ప్రాంత ప్రతినిధుల సంఖ్య నిర్ణయం అవుతుంది. ఈ ప్రతినిధుల నుంచి ప్రాంత కార్యకారిణి ఎన్నుకోబడుతుంది. ప్రాంత స్థాయిలో ప్రాంత కార్యకారిణియే కార్యనిర్వాహక వ్యవస్థ. ప్రాంతం మొత్తం నుంచి 10-12 మంది ప్రతినిధులు ఇందులో సభ్యులుగా వుంటారు. ప్రాంత ప్రతినిధులంతా కలిసి 3 సంవత్సరాల వ్యవధి కొరకు ప్రాంత సంఘచాలక్ ను, ఎన్నుకుంటారు. ప్రాంత సంఘచాలక్ ఇతర పెద్దలతో సంప్రదించి ప్రాంత కార్యవాహ, ఇతర పదాధికారులను నియమిస్తారు. ప్రాంత సంఘచాలక్ నేరుగా గానీ, వారి అనుమతితో కానీ విభాగ్, జిల్లా, నగర సంఘచాలకులను నియమిస్తారు.
అఖిల భారత కార్యకారిణి మండల్ ఈ క్రింది వారితో వుంటుంది…
1. ప్రాంత సంఘచాలకులు, సహ సంఘచాలకులు
2. ప్రాంత కార్యవాహలు, సహ కార్యవాహలు
3. ప్రాంత ప్రచారక్ లు, సహ ప్రచారక్ లు
4. ప్రాంత కార్యకారిణి నుంచి ప్రతినిధులు
సంఘ పదకోశం :
సంఘ సంస్థాగత నిర్మాణం, బాధ్యతలు, సంఘంలో ఉపయోగించే పదజాలాన్ని చూద్దాం.
1. అఖిల భారతీయ కార్యకారిణీ మండల్ (ABKM)
సర్ సంఘచాలక్, సర్ కార్యవాహ, 6 గురు సహ సర్ కార్యవాహలు, శారీరిక్ ప్రముఖ్, బౌద్ధిక్ ప్రముఖ్, సేవా ప్రముఖ్, వ్యవస్థా ప్రముఖ్, ప్రచార ప్రముఖ్, గతివిధి ప్రముఖ్, సంపర్క ప్రముఖ్, ఆహ్వానించబడ్డ కొద్ది మంది సభ్యులు, అన్ని ప్రాంతాల ప్రాంత సంఘచాలకులు, సహ ప్రాంత సంఘచాలకులు, ప్రాంత కార్యవాహలు, సహ ప్రాంత కార్యవాహలు, ప్రాంత ప్రచారక్ లు, సహ ప్రాంత ప్రచారక్ లు వీరంతా అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ కి అపేక్షితులు.వీరితో పాటు స్వయంసేవకుల ద్వారా నడుపబడుతున్న వివిధ క్షేత్ర సంస్థల నుంచి కొంత మంది పదాధికారులు కూడా ఈ బైఠక్ కి ఆహ్వానితులు.
2. అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS)
సంఘానికి సంబంధించిన అత్యున్నత నిర్ణయాక మండలి. ప్రజా సంఘాల కుండే ‘‘సర్వ సభ్య మండలి’’ లాంటిది. ప్రాంతాల నుంచి ఎంపిక కాబడిన కేంద్రీయ ప్రతినిధులు 3 సంవత్సరాల కాల వ్యవధి కొరకు ‘‘సర్ కార్యవాహ్’’ను ఎన్నుకుంటారు. ఇందులో కేంద్రీయ ప్రతినిధులతో పాటు అఖిల భారతీయ కార్యకారిణీ మండల్ మరియు ప్రాంతాల కార్యవిభాగాల ప్రముఖులు కూడా అపేక్షితులు. వీరితో పాటు దేశంలోని అన్ని విభాగ్ ల విభాగ్ ప్రచారకులు, స్వయంసేవకుల ద్వారా నడపబడుతున్న వివిధ క్షేత్ర సంస్థల నుంచి ఎంపిక చేయబడిన ప్రతినిధులు ఆహ్వానితులుగా వుంటారు.
సంఘ నిర్మాణం :
శాఖ : ఆరెస్సెస్ ప్రాథమిక అంగం శాఖ. పనికి సంబంధించి అత్యంత ప్రధానమైంది. ప్రతి నిత్యం నియమిత సమయంలో స్వయంసేవకులందరూ కలుసుకొని, ఆటలాడుకొని, వ్యాయామం చేసి, చర్చలు జరిపే స్థలమే శాఖ. అన్ని శాఖల ఉద్దేశం, పని విధానం అంతా కూడా ఒకేలా వుంటాయి. బాలాసాహేబ్ దేవరస్ అన్నట్లు ‘‘శాఖ అనేది సమాజానికి ఉపయోగపడే అన్ని రకాల వ్యక్తులను తయారుచేసే విశ్వవిద్యాలయం’. ఆరెస్సెస్ శాఖలో వుండే ఆటలే ధ్యేయ సాధనాలు.
సంఘ పదజాలం :
గణవేష : యూనిఫారం
సంఘ శిక్షావర్గ : ఆరెస్సెస్ శిక్షణా శిబిరం
సంవాద్ : చర్చ
దాయిత్వ : బాధ్యత
సంఘ ధ్వజం : కాషాయ జెండా
సంఘ పరివార్ : సంఘ స్ఫూర్తితో స్వయంసేవకుల ద్వారా సమాజంలోని విభిన్న రంగాలలో పనిచేసే సంస్థలు
సంఘ బాధ్యతలు :
ప్రచారక్ : సంఘ లక్ష్యంతో, ధ్యేయంతో స్ఫూర్తి పొంది, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికై తన సమయాన్నంతటినీ సమర్పించే వ్యక్తిని సంఘ పరిభాషలో ‘‘ప్రచారక్’’ అంటారు.
సర్ సంఘచాలక్ :మిత్రుడు, మార్గదర్శి, తత్వవేత్త
సర్ కార్యవాహ : ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి
సహ సర్ కార్యవాహ : సహ ప్రధాన కార్యదర్శి
సంఘ సమన్వయ్ : సమన్వయం,
ముఖ్య శిక్షక్ : ప్రాథమిక అంగమైన శాఖకు ప్రధానమైన వ్యక్తి.
ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం
శాఖ (గట) – ముఖ్య శిక్షక్ (గట నాయక్, స్వయంసేవకులు)
స్థాయి : మండల స్థాయి, బస్తీ : మండల కార్యవాహ
స్థాయి : ఖండ,తాలూకా, నగర స్థాయి : ఖండ ప్రచారక్, కార్యవాహ, కార్యకారిణి, బాధ్యతలు : ఖండ/ నగర సంఘచాలక్
స్థాయి : జిల్లా, మహానగర్ : జిల్లా కార్యవాహ, ప్రచారక్, కార్యకారిణి, : జిల్లా సంఘచాలక్
స్థాయి : విభాగ్ స్థాయి : విభాగ్ ప్రచారక్, కార్యవాహ,కార్యకారిణి, బాధ్యతలు : విభాగ్ సంఘచాలక్
స్థాయి : ప్రాంత స్థాయి, ప్రాంత కార్యవాహ, ప్రచారక్, కార్యకారిణి : బాధ్యతలు : ప్రాంత సంఘచాలక్ (ఎన్నుకోబడతారు)
స్థాయి : క్షేత్ర స్థాయి : క్షేత్ర కార్యవాహ, ప్రచారక్, కార్యకారిణి, బాధ్యతలు : క్షేత్ర సంఘచాలక్, (ఎన్నుకోబడతారు)
స్థాయి : అఖిల భారతీయ : అఖిల భారతీయ ప్రతినిధి సభ, (1400 మంది ప్రతినిధులు, అఖిల భారతీయ కార్యకారిణి, బాధ్యతలు : సర్ సంఘచాలక్ (నియమింపబడతారు, సర్ కార్యవాహ మండల్ (ఎన్నుకోబడతారు.)