News

’’జామియా సిరాజ్ ఉల్ ఉలూమ్’’ ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించిన సర్కార్

44views

కాశ్మీర్ లోని షోఫియాన్ లో వున్న దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్ ఉల్ ఉలూమ్’’ ను కాశ్మీర్ ప్రభుత్వం చట్ట వ్యతిరేక సంస్థ’’ గా ప్రకటించింది.చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం సెక్షన్ 8(1) కింద జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దారుల్ ఉలూమ్ జామియా సిరాజ్ ఉల్ ఉలూమ్ దక్షిణ కాశ్మీర్ లోనే అతిపెద్ద మదర్సాగా పరిగణిస్తారు. ఈ చట్ట విరుద్ధ సంస్థ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వుంది.ఇందులో 5 ఎకరాల్లో పండ్ల తోట కూడా వుంది. సుమారు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

షోపియన్ SSP సమర్పించిన నివేదిక, అందుబాటులో వున్న ఆధారాలను ఆధారం చేసుకునే, చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నామని కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ ప్రకటించారు.అలాగే మదర్సాను సీల్ చేసే ప్రక్రియను, ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.అలాగే ఇక్కడి విద్యార్ధులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తామని ప్రకటించారు.

జామియా సిరాజుల్ ఉలూమ్ ను 25 సంవత్సరాల క్రితం జమాత్ ఎ ఇస్లామీని స్థాపించారు. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 28న నిషేధించింది. పరిపాలన వర్గాల ప్రకారం, జమాత్-ఎ-ఇస్లామీతో అనుబంధం కలిగిన వ్యక్తులే మదరసాలోని అన్ని కీలక పదవులను నిర్వహిస్తున్నారు, మరియు ఇది పూర్తిగా ఆ సంస్థ నియంత్రణలోనే పనిచేస్తోంది.

అయితే.. ఇది విద్యను బోధించే కేంద్రంగా వున్నప్పటికీ.. లోపల మాత్రం ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ వుంటారని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడి పూర్వ విద్యార్థులు చాలా మంది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల్లో చేరారు.అంతేకాకుండా వేర్పాటువాద కార్యకలాపాలలో కూడా పాలుపంచుకుంటున్నారని తేలింది.