
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆదివారం (ఏప్రిల్ 19) ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది.
కర్నూలు విభాగ్ సంఘచాలక్ శ్రీ నీలకంఠం గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్ర ప్రాంత సహ సంపర్క ప్రముఖ్ శ్రీ ఆలూరి రాఘవేంద్ర గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా సంఘ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ గారు కూడా వేదికను అలంకరించారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రధాన వక్త మాట్లాడుతూ సంఘం దృష్టికోణాన్ని వివరించారు. “సేవా హీ పరమో ధర్మః” అనే సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా, “మీ దగ్గర టీం ఉంటే సంఘం దగ్గర థీం ఉంది; మీ దగ్గర థీం ఉంటే సంఘం దగ్గర టీం ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే 2047 నాటికి వైభవ భారతాన్ని నిర్మించవచ్చు” అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కార్యక్రమ నివేదిక:
కార్యక్రమానికి మొత్తం 300 మంది ఆహ్వానితులు ఉండగా, 212 మంది హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 70గా నమోదైంది. మొత్తం 10 శ్రేణుల్లో అన్ని శ్రేణుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల సంఖ్య 20గా ఉండగా, మొత్తం గటనాయకులు 80 మంది ఉండగా, అందులో 42 మంది హాజరయ్యారు. ప్రబంధకుల సంఖ్య 30గా నమోదైంది. కార్యక్రమంలో మొత్తం హాజరు సంఖ్య 284గా ఉంది.





