నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ దాని పూర్వవైభవాన్ని ఆధునిక రూపంలో పునఃస్థాపించడానికి ఉన్న జాతీయ, అంతర్జాతీయ నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం 8 శతాబ్దాల పాటు విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లిందని, దాని నాశనం కేవలం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి తీవ్ర నష్టమని అన్నారు.5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్తుడు దీనిని స్థాపించాడని, గుప్త పాలకులతో పాటు, హర్షవర్ధనుడు మరియు పాల రాజవంశం రాజులు కూడా దీనికి ఆదరణ కల్పించారు. ఇది బౌద్ధ ధర్మం, తాత్వికత, యోగా, వేదాంతం, ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం మరియు ఇతర విద్యలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు.చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, మరియు ఆగ్నేయాసియా వంటి దేశాల నుండి విద్యార్థులు, పండితులు ఇక్కడ విద్యనభ్యసించడానికి వచ్చేవారని తెలిపారు. బిహార్‌లోని రాజ్‌గర్‌లో నూతన నలంద విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన విద్యార్థులు.. డిగ్రీతో పాటు మానవత్వపు సమష్టి వారసత్వాన్నీ పొందుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది 30కిపైగా దేశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి పట్టాలు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
77views
You Might Also Like
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి
3
రైతులు సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయ...
ఆదివాసీ సంస్కృతికి బాట
3
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఆదివాసీ కొండరెడ్లు బాట పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే ఈ పండుగలు ప్రారంభం కావడంతో ఏలూరు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదివాసీ...
మలేసియాలో ఉద్యోగాలంటూ మహిళా టెకీలకు నిదాఖాన్ ట్రాప్
26
మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎ్‌సలో వెలుగుచూసిన రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న నిదా ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఈ వ్యవహారంలో నిదా ఖాన్...
ధర్మాచరణతో ఉన్నతస్థితి
‘మరొకరి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించడం కంటే, లోపాలున్నా సరే మన స్వధర్మాన్ని ఆచరించడం మిన్న’- భగవద్గీత నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో...
పుణెలో సరస్ బాగ్ వద్ద నిరసన: పవిత్రత కాపాడాలని హిందుత్వ మద్దతుదారుల డిమాండ్
27
మహారాష్ట్ర పుణెలోని సరస్ బాగ్ ప్రాంతంలో హిందుత్వ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఫుట్‌పాత్‌పై నిర్వహించిన ఈ ఆందోళనలో వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో...
భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ
తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె...





