News

ఆపరేషన్ సిందూర్ పై దేశ వ్యతిరేక కంటెంట్… షానూ మాలిక్ అరెస్ట్

99views
ఆపరేషన్ సిందూర్ తో ముడిపడి వున్న దేశ వ్యతిరేక కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు షానూ మాలిక్ అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివాదాస్పద వీడియో ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. షానూ మాలిక్ మీరాపూర్ ప్రాంతంలోని సంభల్ హేడా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షేక్ మాలిక్ షేర్ చేసిన వీడియోలో దేశ వ్యతిరేకమైన, అభ్యంతరకరమైన కంటెంట్ వుందని పోలీసులు ధ్రువీకరించారు. అందుకే అరెస్ట్ చేశామని, దర్యాప్తులో భాగంగా మాలిక్ మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించిన ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) లోని సెక్షన్ 152 కింద అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, చట్టవిరుద్ధమైన మరియు దేశ వ్యతిరేక కార్యకలాపాలను కఠినంగా నియంత్రించే చట్టమైన ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967’ లోని సెక్షన్ 13 కింద కూడా అతనిపై కేసులు నమోదయ్యాయి.