News

కంటైనర్ లో అక్రమంగా గోవుల రవాణా

84views

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కంటైనర్‌లో తరలిస్తున్న 89 పశువులను చింతూరు మండలం లక్కవరం జంక్షన్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో కంటైనర్‌ను సోదా చేయగా గోవుల అక్రమ రవాణా బయట పడినట్లు మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్‌ నాసిర్‌హుస్సేన్‌ తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న గోవులను గో సంరక్షణశాలకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.