News

నంద్యాలలో ప్రేరణ దాయకంగా జరిగిన సద్బావ సమావేశం

194views

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఐదవ కార్యక్రమము సద్భావ సమావేశం ఈ కార్యక్రమం నంద్యాల నగరంలోని శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది.

సదరు కార్యక్రమంలో నగరంలోని 30 కి పైగా హిందూ వర్గాలు పాల్గొనడం విశేషం.

ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ్ సంపర్క ప్రముఖ శ్రీ పరశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా మార్గదర్శనం చేస్తూ మన పురాణ ఇతిహాసాలలో ఎక్కడ కులాల గురించి ప్రస్తావనలేదని ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపినటువంటి “చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః” అనే శ్లోకం గుర్తు చేశారు. భారతదేశ మూలాలు వర్ణ వ్యవస్థ ఆధారంగానే నిర్మించబడ్డాయని కుల వ్యవస్థ గురించి ఏ ఇతిహాసాలో పురాణాలు ఏ గ్రంథాలలోనూ వివరించ లేదని తెలియజేశారు.

హిందూ దేవాలయాలకు కులాల పేర్లు తీసేయాలని, అన్ని సామాజిక వర్గాల వారు అన్ని గుళ్ళకు ఎటువంటి వివక్ష లేకుండా ప్రవేశించ చగలిగే రోజులు రావాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా వారు ఆర్ఎస్ఎస్ ప్రభోదిస్తున్న పంచ పరివర్తన లో భాగంగా సామాజిక సమరసత కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ స్వదేశీ మరియు పౌర విధులు వంటి అంశాలను వివరించారు. ప్రతి హిందూ కుటుంబంలో భజన్, భోజన, భాష, భూషణ, బ్రమన్ పైవన్నీ ప్రతి హిందూ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.

కుల సంఘాల పెద్దలందరూ కలిసి మతాంతరీ కరణలను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు.

ఏ సామాజిక వర్గానికి చెందినప్పటికీ ప్రతి ఒక్క సామాజిక వర్గం గురించి అందరూ తెలుసుకోవాలని ప్రతి ఒక్క సామాజిక వర్గంలో బ్రాహ్మణ వృత్తి చేసేవారు ఉంటారని వారు తెలియజేశారు. ఉదాహరణకు మన ఏరియాలో ఉన్నటువంటి గ్రామదేవతల దగ్గర అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదో ఒక కుటుంబం వారే వారి తర తరాల నుంచి అమ్మవారికి పూజలు నిర్వహించడం మనం చూస్తూ ఉంటామని, అలాగే ప్రతి వర్గం లోనూ మోక్ష సాధనకై సాధన చేసిన మహానుభావులు ఎంత మందినో చూస్తూ ఉంటాము. కనకదాసు గారే గొప్ప ఉదాహరణ అని తెలిపారు.

వక్త సందేశం తర్వాత హిందూ సామాజిక వర్గాల పెద్దలు మాట్లాడుతూ సమాజంలోని అనేక రకాల వ్యత్యాసాలు ఎదుర్కోవటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మూడు నెలలకోసారి జరపాలని కోరారు