
బ్రిటన్‌లోని పాఠశాలల్లో పిల్లల సృజనాత్మకతపై మతపరమైన ఆంక్షలు విధిస్తున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని కొన్ని కౌన్సిల్స్ (స్థానిక ప్రభుత్వాలు) పాఠశాలలకు జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో, పిల్లలు గీసే బొమ్మలు ఇస్లామిక్ చట్టం ప్రకారం ‘దైవదూషణ’ లేదా ‘విగ్రహారాధన’గా పరిగణించబడే అవకాశం ఉందని పేర్కొన్నాయి
లీడ్స్, కాల్డర్‌డేల్, ఓల్డ్ హామ్ మరియు వేక్‌ఫీల్డ్ వంటి కౌన్సిల్స్ రూపొందించిన ‘షేరింగ్ ది జర్నీ’ (అనే డాక్యుమెంట్‌లో కీలక అంశాలను పొందుపరిచారు:
అందులో భాగంగా మనుషుల లేదా ప్రాణుల చిత్రాలను చిత్రించడం కొందరు ముస్లింల నమ్మకాల ప్రకారం తప్పు కావచ్చు. ముఖ్యంగా మొహమ్మద్ ప్రవక్త లేదా ఇతర ప్రవక్తల చిత్రాలను గీయమని విద్యార్థులను అడగకూడదని టీచర్లకు సూచించారు. అంతేకాకుండా ముస్లిం విద్యార్థులు మనుషుల బొమ్మలు గీయడానికి ఇష్టపడకపోతే, వారిని బలవంతం చేయకుండా ప్రత్యామ్నాయంగా కాలిగ్రఫీ లేదా రేఖాగణిత నమూనాలను (ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఇక ఆర్ట్ పాఠాలతో పాటు సంగీతం, నృత్యం , డ్రామా క్లాసులలో కూడా మతపరమైన సున్నితత్వాలను గమనించాలని, విద్యార్థులు తమ విశ్వాసాలకు విరుద్ధంగా భావించే కృత్యాల్లో పాల్గొనేలా చేయకూడదని హెచ్చరించారుజ
ఈ మార్గదర్శకాలపట్ల తీవ్రమైన విమర్షలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా బ్రిటన్ విద్యా వ్యవస్థపై , భావప్రకటన స్వేచ్ఛపై దాడి అని విమర్శకులు మండిపడుతున్నారు. ఇది విద్యా సంస్థల్లో మతపరమైన నిబంధనలను ‘దొడ్డిదారి’లో ప్రవేశపెట్టడమేనని ఫ్రీ స్పీచ్ యూనియన్ అనే సంస్థ తన ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు మరియు కొందరు పార్లమెంట్ సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, చిన్న పిల్లలను ‘దైవదూషణ’ వంటి పెద్ద పదాలతో ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు.





