
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సమావేశాలు హర్యానాలోని సమల్ఖా కేంద్రంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భరత మాత చిత్ర పటానికి పుష్పార్చన చేయడంతో సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 నుంచి 15 వరకూ కొనసాగుతాయి.

ఈ సందర్భంగా ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ సీ.ఆర్. ముకుంద, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముకుంద మొదటి రోజు సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. మొదటి రోజు సమావేశాలను సర సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ హోసబళే ప్రారంభించారని తెలిపారు.
ప్రస్తుతం సంఘ కార్య శతాబ్ది నడుస్తోందని, అందుకే ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. దేశ వ్యాప్తంగా సంస్థాగత విస్తరణ, సామాజిక సంబంధాలు, సంఘ కార్యకలాపాల్లో నిమగ్నమైన 1,400 మంది సంఘ కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు. దేశంలోని ప్రతి రాష్టం నుంచి ప్రతినిధులు వచ్చారని తెలిపారు.
ఇక.. మరణించిన ప్రతిష్ఠిత వ్యక్తులకు అఖిల భారతీయ ప్రతినిధి సభ శ్రద్ధాంజలి ఘటించింది. వారిలో వార్ధాకు చెందిన సద్గురుదాస్ మహారాజ్, మహారాష్ట్ర నుండి పూజ్య దుర్గానంద్ గిరి మహారాజ్ (స్వామీజీ); మరియు కర్ణాటకకు చెందిన డాక్టర్ మాధవ్ గాడ్గిల్, పర్యావరణ శాస్త్రవేత్త; శివరాజ్ పాటిల్ చకుర్కర్, భారత ప్రభుత్వ మాజీ హోం మంత్రి మరియు పంజాబ్ మాజీ గవర్నర్, హాకీ ఆటగాడు, సాలుమరద తిమ్మక్క, పద్మశ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ శాస్త్రవేత్త కే.ఎన్. దీక్షిత్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరియు సరస్వతి నది అట్లాస్‌ను ప్రారంభించిన సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త మరియు నవ్ నలంద మహావిహార్ & సంషి యొక్క ఛాన్సలర్ బల్నాథ్ లబ్బ్; ఉత్తర అస్సాంకు చెందిన కబీంద్ర పుర్కాయస్థ, సీనియర్ స్వయంసేవక్, మాజీ మాజీ మంత్రి మరియు పార్లమెంటు సభ్యుడు; మహారాష్ట్రకు చెందిన డాక్టర్ అశోక్ మోదక్, మీరట్ కి చెందిన ఆనంద్ కుమార్ వున్నారు.
అలాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, నటుడు ధర్మేంద్ర, మాజీ ఎంపీ కొంకణ్ సులక్షణ పండిట్, ఏవీ శరవణన్, తమిళ సినీ ప్రముఖ నిర్మాత; తమిళనాడుకు చెందిన ఎ. వెల్లయన్, మురుగప్ప గ్రూప్ ఛైర్మన్; మరియు ఢిల్లీకి చెందిన స్వరాజ్ కౌశల్ కి కూడా శ్రద్ధాంజలి ఘటించింది.
సంఘ కార్య శతాబ్దిలో సంఘ్ సంస్థాగతంగా చాలా విస్తరించిందని ముకుంద పేర్కొన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా స్వయంసేవకులు దేశమంతా అంకిత భావంతో పనిచేశారని అన్నారు. 4,000 కంటే ఎక్కువ ప్రదేశాలలో సంఘ కార్యం ప్రారంభమైందని, 5,000 కంటే ఎక్కువ కొత్త శాఖలు కూడా ప్రారంభమయ్యాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరిన్ని గ్రామాలలో ఈ శాఖ విస్తరణ కొనసాగుతుందని ప్రకటించారు.
నాగపూర్ లో కార్య శతాబ్ది వేడుకలు ప్రారంభం..
అక్టోబర్ 2 న నాగపూర్ లో సంఘ కార్య శతాబ్ది సంవత్సరం అధికారికంగా ప్రారంభమైందని, ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని గుర్తు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సంఘ కార్య శతాబ్దికి సంబంధించిన స్మారక స్టాంపును విడుదల చేశారని కూడా గుర్తు చేశారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ శాఖలను విస్తరించడం, దృఢీకరణపై దృష్టి పెట్టామన్నారు. అలాగే పంచపరివర్తన్ ( పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, సామాజిక సమరసత, పౌర విధులు) ను కూడా ప్రతిపాదించి, ప్రచారం చేశామన్నారు. అలాగే సమాజంలో వున్న ప్రతిష్ఠిత వ్యక్తులతో సమ్మేళనాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా సమాజంలో నిర్మాణాత్మక ఆలోచనలను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే పౌర సమావేశాలు, మేధోపరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని, వీటి మాధ్యమాల ద్వారా కూడా ఎక్కువ మంది సంఘ్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, బలమైన సంబంధాలను నిర్మించుకుంటున్నారని వివరించారు.అలాగే బస్తీలు, బ్లాక్ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయని, అలాగే సామాజిక సమరసతను సాధించడానికి ప్రముఖులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అన్నారు.
ఇక సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘హిందూ సమ్మేళనాలు’’ కూడా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే గృహ సంపర్క కార్యక్రమం కూడా జరిగిందని, ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామాన్ని చేరుకోవడమే ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కుటుంబాలను చేరుకున్నామని, ఈ పని ఇంకా కొనసాగుతూనే వుందన్నారు. అత్యంత క్రమశిక్షణతో స్వయంసేవకులు ఈ కార్యాన్ని నిర్వహించారని, వీరందరి అనుభవాలు అత్యంత సానుకూలంగానే వున్నాయన్నారు.






