News

ఘనంగా ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ

134views

శ్రీశైల క్షేత్ర పరివార దేవాలయమైన పాలధార పంచదార వద్ద శారదాంబ సహిత ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతి మహాస్వామి చేతుమీదుగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలం.. ఆదిశంకరుడికి ప్రీతికరమైన క్షేత్రం
శ్రీశైల మహా క్షేత్రం ఆదిశంకరాచార్యులకు ప్రీతికరమైన క్షేత్రమని శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి మహాస్వామి అన్నారు. ఆదిశంకరాచార్యులు శివానందలహరి, సౌందర్యలహరి, యోగితారవళి స్తోత్రాలను పాలధార పంచధార వద్దే రచించారని తెలిపారు.-శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి మహాస్వామి