
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా దుబాయి, అబుదాబీల్లో హిందూ దేవాలయాల్లో భక్తుల సందర్శనను నిరవధికంగా నిలిపివేశారు. అయితే దేవుళ్లకు దీపారాదనతోపాటు పూజారులు పూజలు చేస్తున్నారు.తామంతా యూఏఈ, గల్ఫ్‌లో సురక్షిత పాంత్రానికి వెళ్లేందుకు పూజలు చేస్తున్నట్లు హిందూ దేవాలయాల వర్గాలు తెలిపాయి. దుబాయితోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని చర్చిలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి.
ప్రయాణించిన విమానాలను సంబంధిత ఎయిర్‌లైన్స్ రద్దు చేయడంతో వారంతా సౌదీలో చిక్కుకున్నారు. సౌదీ అరేబియా విమానాల్లో వచ్చిన యాత్రికులు మాత్రం ఆ విమానాల ద్వారా తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రంజాన్ పర్వదిన రద్దీ వల్ల యాత్రికులు తాము బస చేసిన హోటళ్లలో అదనపు దినాలు బసచేయడానికి వీల్లేకపోవడం సవాల్‌గా మారింది.





