
స్వార్థాన్ని పక్కన పెట్టి సేవాభావంతో ముందుకొస్తేనే మెరుగైన సమాజం సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. సేవాభారతి ఆధ్వ ర్యంలో విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ‘బాల మేళా’ నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘పాఠశాల విద్య ఎంతో కీలకం. అది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులను గౌర వించాలి. గురువుల పట్ల భక్తి, గౌరవం పెంచుకోవాలి. స్నేహితులతో నిజాయతీగా ఉంటూ.. జీవితాంతం స్నేహం కొనసాగేలా ప్రవర్తించాలి. సామాజిక మాధ్య మాలు, సెల్ఫోన్లు, టీవీలను విద్యార్థులు మంచి పనులకే వినియోగించాలి.
విద్య ద్వారా పేదరికాన్ని జయించవ చ్చని ఏపీజే అబ్దుల్ కలాం నిరూపించి రాష్ట్రపతి అయ్యారు. టీ అమ్ముకునే వ్యక్తి మోదీ దేశప్రధాని స్థాయికి ఎదగడం పట్టుదలకు ఉదాహరణ. గిరిజన మహిళ ద్రౌపదీముర్ము చిత్తశుద్ధితో కష్టపడి రాష్ట్రపతి అయ్యారు’ అని వివరించారు. అసంఘటిత కార్మికుల పిల్లలకు విద్య, ఆరోగ్య సహాయం అందిస్తున్న సేవా భారతి కార్యక్రమాలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి కొనియాడారు. సేవాభారతికి సుజనా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు మాట్లాడారు.





