News

హిందువులకు రక్షణ ఏది?

201views

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కోఠి లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ అధికార పార్టీ వచ్చినప్పటినుండి కేవలం ముస్లింల సంతృప్తి కోసం హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈరోజు హిందువులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయిందని కావున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే హిందువులకు మరియు హిందూ దేవాలయాలకు పూర్తి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేశారు. అలాగే గోవుల అక్రమ రవాణాపై ప్రశ్నిస్తున్న వారిని అధికార మదంతో అక్రమ కేసులు బలాయించి హిందువులను అణగదొక్కుతున్నారని తెలిపారు.

నేడు ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే తొందర లోనే మనకు కూడా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి దాపరిస్తుందేమోనని అనుమానం వేస్తోందన్నారు. ఈరోజు హిందువు రోడ్డు పైకి రావాలంటే భయపడే దౌర్భాగ్య పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడుతోంది. ముఖ్యంగా దేవాలయాలపై దాడులు చేస్తున్న పట్టించుకోకుండా గోమాతల అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంటే అక్రమ రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి గోమాతలను రక్షిస్తున్న వారిపై ముస్లింల సంతృప్తి కోసం గోరక్షకులపై కేసు వేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. పోలీసులు చేయవలసిన పనిని గో భక్తులు చేస్తున్నారు. వారిని అభినందించడం పోయి వారిపై అక్రమ కేసులు పెట్టి వారిని బెదిరిస్తున్నారన్నారు.

ఇకనైనా ముఖ్యమంత్రి గారు హిందువుల రక్షణ కోసం చర్యలు చేపట్టకపోతే ఇక హిందువులు తమ రక్షణ కోసం రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. గోమాతలను అక్రమంగా రవాణా చేస్తున్న దుండగులను గుర్తించి చట్ట ప్రకారం వారిపై చర్య చేపట్టాలని కోరుతున్నాం. లేని పక్షంలో హిందువుల రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రత్యక్ష కార్యచరణతో వస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో శ్రీ లగిశెట్టి జగదీశ్వర్ గారు ప్రాంత కార్యాలయ ఇంచార్జ్ మరియు శ్రీ భరత్ వంశీ మాజీ ప్రచార కన్వీనర్ భాగ్యనగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.