News

గోవుల రవాణాను అడ్డుకున్న ‘గోరక్షకులు’

133views

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో భారీ కంటైనర్‌లో గోవులను తరలిస్తుండగా గోరక్షక్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌పై స్థానికులు, గోరక్షక్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గోవులను గోశాలకు తరలించాలని గో రక్షక్ కార్యకర్తలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.