
పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లోని షియాలకు చెందిన ఓ ప్రార్థనా మందిరం దగ్గర జరిగిన ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 160 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇస్లామాబాద్‌లోని షెహజాద్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రార్థనా మందిరం గేటు దగ్గరకు చేరుకున్న ఓ సూసైడ్ బాంబర్.. ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ.. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)తో సంబంధమున్న ఓ విదేశీ పౌరుడు ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసు అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియేయెవ్ పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.





