
అజ్మీర్ లోని సమ్రాట్ చౌహాన్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. భారత్ కి పాకిస్తాన్ ‘‘పెద్దన్న’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇది వ్యంగ్యంగా వ్యాఖ్యానించానని, దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మనోజ్ బెహర్వాల్ వివరణ ఇచ్చారు. అయినా.. దీనిని ఎవ్వరూ నమ్మడం లేదు.
ఈ నెల 23,24 తేదీల్లో బీవర్ లోని సనాతన ధర్మ ప్రభుత్వ కళాశాలలో సోషియోలాజికల్ అసోసియేషన్ యొక్క 31వ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఇందులోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 14, 1947 లో భారత్ స్వాతంత్రాన్ని పొందిందని, ఆగస్టు 15 తెల్లవారుఝామున స్వతంత్రమైందని, అదే పాక్ 12 గంటల ముందే స్వాతంత్రం పొందిందని, అందుకే పెద్దన్న అంటూ వ్యాఖ్యనించారు.
దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అది పూర్తిగా వ్యంగ్యమని తనను తాను సమర్థించుకున్నారు. భారత్ ఓ పురాతన సనాతన నాగరికత అని చెప్పుకొచ్చారు. ‘‘”‘పెద్దన్న’ అంటే ఏమిటి? నేడు భారతదేశం సాధించిన విజయాలను చూడండి.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎక్కడ ఉందో మరియు పాకిస్తాన్ ఎక్కడ ఉందో పోల్చుకోండి’’ అని అన్నారు.
మరోవైపు స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి భారత్ ప్రయాణాన్ని నొక్కి చెబుతూ, ప్రధాని నెహ్రూతో సహా ఇతర స్వాతంత్ర యోధులను కూడా ఆయన ప్రశంసించారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోస్తూ, నిత్యం ఏదో రకంగా భారత్ ను ఇబ్బందులు పెడుతున్న పాక్ ను ఎందుకలా అన్నారని అందరూ ప్రశ్నిస్తున్నారు.





