News

140 మంది కన్యలకు పాదుకా పూజలు

238views

అమలాపురంలోని స్థానిక జిల్లా పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న ప్రణవనాద నిలయం వద్ద శ్రీగౌతమ అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో 140 మంది కన్యలకు సామూహికంగా పాదుకా పూజలు జరిగాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ ప్రణవనాద నిలయం వద్ద జరుగుతున్న శ్రీశ్యామలాదేవి షోడశ రాత్రి అఖండ హోమ, పూజా మహోత్సవాల్లో భాగంగా కన్యలకు ఈ పాదుకా పూజలు జరిగాయి. రాజమహేంద్రవరానికి చెందిన వేము వెంకట శివకుమార్‌ మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేయించారు. కన్యలను వారి తల్లులు రాజ మాతంగి స్వరూపంగా భావించి దేవతార్చన, విశేష పూజలు చేశారు. వచ్చే నెల 2వ తేదీ రాత్రి 8 గంటలకు మహా పూర్ణాహుతితో శ్యామలాదేవి షోడశ రాత్రి అఖండ హోమ, పూజా మహోత్సవాలు ముగుస్తాయని మహోత్సవాల గురువు పోతురాజు రామకృష్ణారావు తెలిపారు. అక్షయ పాత్ర వ్యవస్థాపకురాలు నాగ కనకదుర్గ పర్యవేక్షణలో పాదుకా పూజలు జరిగాయి.