News

ఏజెన్సీలో వెదురు ఉత్పత్తులకు ప్రోత్సాహం

52views

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో వెదురుతో తయారుచేసిన ఉత్పత్తుల అభివృద్ధికి ప్రోత్సహించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ పేర్కొన్నారు.

రంపచోడవరం మండలం సూర్లవాడ గ్రామంలో గిరిజనులు తయారుచేసిన వెదురు పరికరాలకు సంబంధించిన సమావేశాలకు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.

ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని గిరిజనులు తయారుచేసిన వెదురు పరికరాలు మైదాన ప్రాంతంలో వెలుగు ద్వారా కొనుగోలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రాంతంలోని గిరిజనులకు వెదురు పరికరాలు తయారు చేసే విధంగా అవసరాన్ని బట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వెదురు పరికరాలు ఎంతమంది తయారు చేస్తున్నారు. తయారుచేసిన పరికరాలు మార్కెట్ కు ఏ విధంగా తరలించే విధానాలను పరిశీలించారు.