
నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక సేవా సమితి సమర్పణలో, శ్రీ సరస్వతీ విద్యాపీఠం, APPUSMA నంద్యాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ లో
మన బంగారు కొండల నెలా పెంచాలి? రండి తెలుసు కుందాం అనే అంశంపై విద్యార్థులకు తల్లిదండ్రులకు “పాజిటివ్ పేరెంటింగ్” కార్యక్రమం నిర్వహించారు.
విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కాదర్ బాద్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీ రామకృష్ణారెడ్డి, అతిథులు ఐయమ్ఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షులు డాక్టర్ మాధవి , లైఫ్ ఉమెన్స్ హెల్త్ క్లబ్ నిర్వాహకులు శ్రీమతి లక్ష్మి , వాసవి హై స్కూల్ నిర్వాహకులు శ్రీ యు వి దస్తగిరి రెడ్డి , శ్రీ గెలివి శ్రీకాంత్ మరియు చాణక్య హై స్కూల్ నిర్వాహకులు శ్రీ కె బాల మద్దిలేటి పూజ, మాలార్పణ తో కార్యక్రమం ప్రారంభమైంది.

ప్రఖ్యాత సైకాలజిస్ట్ శ్రీమతి టి. స్వప్న గారు చిన్నారుల పెంపకంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తుచేస్తూ , పిల్లల పెంపకంలో తీసుకొవలసిన మెలకువలనూ , టీవీ మరియు మొబైల్ అడిక్షన్స్ రాకుండా ఏ విధంగా మనం జాగ్రత్త పడగలమో వివరించి ఆపై తల్లిదండ్రుల సందేహాలకు చక్కటి సూచనలను ఇచ్చారు. నిరంతరం ఆత్మీయ తాను రాగాలు వెల్లి విరిసే ఇంటిలో మాత్రమే పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదిగి ఆదర్శవంతమైన మూర్తిమత్వం సంతరించుకుని ఆ కుటుంబానికి, సమాజానికి, దేశానికి చక్కటి కీర్తి ప్రతిష్టలు చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో అంతే బాధ్యతాయుతంగా పెంచాలని తెలియజేశారు.
సకారాత్మక రీతిలో పిల్లల్ని పెంచినప్పుడే వారు జీవితంలో రాణిస్తారని , అందుకు తగిన విధంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందంతో తల్లిదండ్రులు నిరంతరం సంపర్కంలో ఉంటూ దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జి రామకృష్ణా రెడ్డి ఉద్బోధించారు.

నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం, ఐఎంఏ ఉమెన్స్ వింగ్ మరియు లైఫ్స్ ఉమెన్స్ హెల్త్ క్లబ్ సహకారంతో నిర్వహించ బడిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కాదర్ బాద్ ఉదయ్ శంకర్, శ్రీ కాదర్ బాద్ నర్సింగ్ రావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులతో పాటు శ్రీ చాటకొండ శ్రీకాంత్, శ్రీ యాతం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, శ్రీ మురళీధర్ రెడ్డి, శ్రీ వై.రాంప్రసాద్, శ్రీ చెన్నకేశవ, శ్రీ మల్లికార్జున, 20 విద్యాసంస్థల నుండి 210 దాకా తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ సమావేశం ఆద్యంతం సందేశ భరితంగా సాగింది.





