News

1న కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా కేసులో వాదనలు

226views

కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ ను సవాలు చేస్తూ హిందూ సంస్థ ఒకటి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను డిసెంబరు 1వ తేదీ నుంచి వింటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో వాదనలను వివరంగా వినాల్సి ఉందని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ అరాథేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. మథురలోని వివాదాస్పద స్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ ఓ హిందూ సంస్థ.. విడిగా దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు.. హిందూ భక్తులందరికీ ప్రతినిధిగా భావిస్తామని రూలింగ్ ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ మరో హిందూ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.