News

‘అక్షయపాత్ర’ ద్వారా రుచికరమైన భోజనం

123views

అక్షయపాత్ర ఫౌండేషన్‌ ద్వారా సుమారు 15 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని హరేకృష్ణ మూవ్‌వెంట్‌ విశాఖ జిల్లా ప్రెసిడెంట్‌ నిష్కించిన భక్త దాస అన్నారు.విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం ఐఐఎం రోడ్డులో హరేకృష్ణ మూవ్‌వెంట్‌ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఆధునిక సాంకేతికతతో కూడిన వంటశాలను ‘జాగృతి యాత్ర’ యాత్రికులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి విశిష్టతలపై మాట్లాడారు. ఆహారం తయారీ విధానం, వినియోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం, సరకుల నిల్వ, తయారు చేసిన ఆహారం వాహనాల్లో సరఫరా వంటి నిర్వహణాపరమైన విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులు విశ్వాస్, అంబరీదాస, జాగృతి యాత్ర చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అశుతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

  • జాగృతి యాత్ర ప్రస్థానం: గడిచిన 15 ఏళ్లుగా ఏటా వ్యాపార, పారిశ్రామిక, వినూత్న ఆలోచనలతో కూడిన దేశ, విదేశాలకు చెందిన యువతీ యువకులతో జాగృతి యాత్ర చేపడుతున్నారు. ఇందుకోసం 18 భోగీలు కలిగిన ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. వీరు దేశంలోని 12 మహా నగరాల్లో 15 రోజుల పాటు పర్యటిస్తారు.
  • ముంబయిలో ఈ నెల 8న 580 మందితో జాగృతి యాత్ర ప్రారంభమైంది. ప్రధానంగా మధురైలోని అరవింద్‌ కంటి వైద్యశాల, బెంగళూరులో ఇన్ఫోసిస్‌ సంస్థను సందర్శించి విశాఖ చేరుకున్నారు. తర్వాత ఒడిశా వెళ్లనున్నారు.