
అయ్యప్పస్వాముల రద్దీని పురస్కరించుకుని నాందేడు నుంచి కడప మీదుగా కొల్లంకు ప్రత్యేక రైలును నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07111) నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8, 15 తేదీలలో నాందేడులో ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరి నిజామబాద్, మేడ్చల్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా కడపకు తెల్లవారుజామున 3.48 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాడ్పాడి, విల్లుపురం, తిరుచునాపల్లి, మధురై, శివకాశి మీదు గా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కొల్లం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు (07112) ఈనెల 22, 28, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీలలో కొల్లంలో శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు బయల్దేరి ఇదే మార్గంలో ఆదివారం రాత్రి 9.30 గంటలకు నాందేడుకు చేరుకుంటుందని వివరించారు.




