News

శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

258views

శ్రీశైలం పర్యటనలో భాగంగా ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సంయుక్తంగా సందర్శించారు.


కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా మోదీ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న అతి పెద్ద శివాజీ చిత్రానికి మోదీ నమస్కరించారు.

దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు మోదీకి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూలను సమర్పించి నమస్కరించారు. కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్టు నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు.