News

ఆకట్టుకున్న సంస్కార భారతి ఛత్రపతి శివాజీ నాటక ప్రదర్శన

221views

సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారధ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి ఈ నెల 12వ తేదీన అనకాపల్లి వద్ద గల మునగపాక గ్రామంలో ప్రదర్శించిన ‘జయహెూ ఛత్రపతి శివాజీ’ చారిత్రక నాటకం అద్యంతం ఆకట్టుకుంది. ఎక్కడా విసుగు విరామం లేకుండా దాదాపు సాగిన ఈ నాటకాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. 60 మంది కళాకారులతో ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆకట్టుకుంది.

నాటకంలో భాగంగా ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, ఆతరవాతే కుటుంబం అంటూ శివాజీకి సమర్థ రామదాను చేసిన హితబోధ లాంటి ఘట్టాలకు హర్షధ్వానాలు మిన్నంటాయి. భర్త చనిపోతే భార్య కూడా సహగమనం చేయాలన్న ఉద్దేశ్యంతో సతీ సహగమనానికి వెళ్తున్న తల్లి జిజియా బాయిని నిలువరించి, ఉత్తములు ఏది ఆచరిస్తే అదే అందరూ ఆచరిస్తారని శివాజీ చెబుతూ, తన రాజ్యంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నట్లు శివాజీ ప్రకటించిన ఘట్టం ఆకట్టుకుంది.సింహం సింహం పోరాడుకుని చనిపోతే, అడవి… గుంటనక్కల పాలవుతుంది’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. శివాజీగా సాయి శంకర్, అఫ్జల్ ఖాన్ గా అనంత్ శ్రీకర్, ఔరంగ జేబుగా నర్సయ్య, జిజియా బాయిగా రూపశ్రీ తదితరులు తమ నటనతో రక్తికట్టించారు. మొఘలు రాజుల కుటిల యత్నాలను ఎదుర్కొంటూ, మరోపక్క స్వదేశీ రాజులను సమన్వయ పరచుకుని హిందూ రాజ్య స్థాపనకు ఏవిధంగా ముందుకు సాగాడో ఈ నాటకం ద్వారా వివరించారు. శివాజీ పట్టాభిషిక్తుడయ్యే ఘటనతో నాటకం ముగించారు.