News

శ్రీరాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ

200views

అంబా ! శాంభవి ! చంద్రమౌళిరబలా పర్ణా !
ఉమా ! పార్వతీ కాళీ ! హైమవతీ ! శివా ! త్రినయనీ ! కాత్యాయనీ! భైరవీ
సావిత్రీ ! నవయవ్వనా ! శుభకరీ ! సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ ! పరదేవతా ! భగవతీ ! శ్రీరాజరాజేశ్వరీ ॥

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో చివరిరోజు శ్రీ రాజరాజేశ్వరిదేవి గా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్ఠానదేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వశుభములు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణపుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాము. సకలశుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.