
గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి మరియు మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘‘ ఈరోజు భారతదేశంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గొప్ప ఆలయాన్ని చూసి ఎవరు గర్వపడరు..? ఎవరైనా గర్వంచకపోతే, వారు భారతీయులనేది సందేహమే’’ అని ఆదిత్యనాథ్ అన్నారు.
మహంత్ దిగ్విజయనాథ్ బానిసత్వ చిహ్నాలను తొలగించాలని నిర్ణయించుకున్నారని, వివాదాస్పద నిర్మాణాన్ని తొలగించడం ద్వారా అయోధ్యంలోని ఒక గొప్ప రామాలయాన్ని నిర్మించాలని కలలు కన్నారని ఆయన అన్నారు. మహంత్ దిగ్విజయనాథ్, మహంత్ అవైద్యనాథ్ ఇద్దరి కల నెరవేరిందని ఆయన అన్నారు. ఒక సాధువు సమాజాన్ని తన కుటుంబంగా, దేశాన్ని తన వంశంగా భావిస్తారని, అతడి ఏకైక గుర్తింపు సనాతన ధర్మమని ఆదిత్యనాథ్ అన్నారు. రామమందిరం మహంతుల దృఢ సంకల్పం, పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు.





