News

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు ఉచిత విద్యుత్తు : ప్రభుత్వ నిర్ణయానికి అభినందనలు

164views

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సహృదయంతో ఈనెల 27 నుండి జరిగే వినాయక చవితి నవరాత్రుల పందిర్లలో కావలసిన విద్యుత్తుని “ఉచితంగా” ఇవ్వాలని నిర్ణయించడంపై ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పల్లెల్లో,బస్తీలలో భక్తితో ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఈనెల 13వ తేదీన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని సమితి పెద్దలు కలిసి విజ్ఞప్తి చేయగా వారు ప్రభుత్వంతో చర్చించి మండపాలు అన్నింటికీ ఉచితంగా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని నిర్ణయించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరిన మేరకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు,ఎలాంటి రుసుములు లేకుండా ఇవ్వడము,అన్ని స్థాయిలలో అధికార యంత్రాంగం స్థానిక గణేశ ఉత్సవ సమితి సమన్వయంతో వినాయక నవరాత్రులను విజయవంతం చేయాలని నిర్ణయించడంతో పాటుగా ఉచిత విద్యుత్తు కూడా ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు, అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు,రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది.