
అస్సాంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చిన్న పిల్లలు ఉదయం ప్రార్థనగా ఖురాన్ ఆయత్‌ను పఠిస్తున్నట్లు కనిపించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది బొంగైగావ్ జిల్లాలోని 619 భద్రగావ్ LP పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఆ పాఠశాలలో చాలా మంది హిందూ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది హిందూ తల్లిదండ్రులు ఉదయం ప్రార్థనలో ఖురాన్ ఆయత్ పఠించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ పిల్లల తల్లిదండ్రులతో సహా, పలు హిందూ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనపై జిల్లా కమిషనర్ వెంటనే విచారణ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) దర్యాప్తు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెహెరుల్ ఇస్లాం, సర్వశిక్ష అభియాన్ CRC నిర్మల్ చౌదరిని సస్పెండ్ చేశారు. పాఠశాలలోని మరో ఇద్దరు ఉపాధ్యాయులను కూడా అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెహెరుల్ ఇస్లాం 2015 లో పాఠశాలలో చేరినప్పటి నుండి ఉదయం ప్రార్థన కోసం సూరా ఫతేహాను చెప్పిస్తున్నట్లు తేలింది. ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన పేరుతో ఇతరులపై ఇస్లామిక్ మతాన్ని రుద్దుతున్నారని స్థానికులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలని . ఈ దురాచారాలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటన జరగడం అనేది మొదటిది కాదు, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో హిందూ విద్యార్థులు ఇస్లామిక్ ప్రార్థనలు చేయమని బలవంతం చేసిన సంఘటనల గురించి గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి.




