News

భారతీయ సంప్రదాయంలో మెలోని

210views

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్‌స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు. ఇక మెలోని వైట్‌హౌస్‌కు చేరుకున్నాక.. అమెరికా సిబ్బందిని ‘నమస్తే’ అంటూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమస్తే అనే పలకరింపు భారతీయ సంప్రదాయం. దీంతో మెలోని.. ప్రధాని మోడీని అనుసరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

అమెరికా ప్రోటోకాల్ చీఫ్ మోనికా క్రౌలీని.. ఇటలీ ప్రధాని మెలోనికి స్వాగతం పలికారు. తొలుత షేక్‌హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. అనంతరం మెలోని రెండు చేతులు జోడించి నమస్తే అంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటలీలో జరిగిన G7 సమావేశంలో కూడా నాయకులను మెలోని ఇదే తరహాలో స్వాగతించారు. శిఖరాగ్ర సమావేశంలో మెలోనిని కూడా మోడీ అలానే పలకరించారు. అందుకు సంబంధించిన వీడియో అప్పుడు వైరల్ అయింది. తాజాగా మరోసారి మెలోని పెట్టిన నమస్తే వైరల్ అవుతోంది.