News

తిరుమల మార్గంలో ఫాస్టాగ్‌ నిబంధన అమలు

217views

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలకు ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయడంతో.. ఫాస్టాగ్‌ లేని వాహనాలను శనివారం అలిపిరి టోల్‌గేట్‌ వద్ద నిలిపేశారు. దాంతో అక్కడ తితిదే ఆధ్వర్యంలో ప్రైవేటు బ్యాంకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో కొందరు ఫాస్టాగ్‌ తీసుకున్నారు. రీఛార్జి చేయించుకోనివారు, బ్లాక్‌లిస్ట్‌ సమస్యలు ఉన్నవారు అక్కడి సిబ్బందిని సంప్రదించారు. దూరప్రాంత భక్తులు ముందే ఏర్పాట్లు చేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.