
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్‌లను తాము విధించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కీలక భేటీ ముగిశాక విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు జరిగిన పరిణామాల తర్వాత.. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు సుంకాల గురించి రెండు, మూడు వారాల్లో పునరాలోచన చేస్తా’ అని ట్రంప్ వెల్లడించారు. పుతిన్‌తో భేటీకి ముందు కూడా ట్రంప్ దీని గురించి ప్రస్తావించారు. భారత్‌ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించే ఉద్దేశం లేదన్నారు. ఇటీవల భారత్‌పై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.





