News

గాజులపల్లి కాదు.. కొలువులపల్లి

262views

గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం ఒకరు సాధిస్తేనే ఎంతో గొప్పగా చెప్పుకొంటారు. అలాంటిది చిన్న మారుమూల గ్రామంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఆశ్చర్యం కలగకమానదు. అనంతపురం జిల్లా గుత్తిమండలంలోని ఇసుకరాళ్లపల్లి పంచాయతీలోని గాజులపల్లి గ్రామం ఈ ఘనకీర్తిని సాధించింది. గ్రామంలో 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇంటికో ఉద్యోగి ఉండటం విశేషం. ఓ ఉమ్మడి కుటుంబంలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ముగ్గురు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారు. ఆయా కుటుంబాలన్నీ తమ పిల్లల్ని వ్యవసాయం, కూలీ పనులు చేస్తూనే పిల్లల్ని ఉన్నంతంగా చదివిస్తున్నారు. గ్రామంలో 1985లో రామాంజినేయులు అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. అప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతుండటం విశేషం.

వివిధ స్థాయిల్లో…
ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో వివిధ స్థాయిలో చాలా మంది స్థిరపడ్డారు. చిన్న గ్రామం నుంచే 13 మంది కానిస్టేబుళ్లు 13, ఉపాధ్యాయులు 12, ప్రభుత్వ వైద్యులు 4, తహసీల్దార్, ఏపీఆర్‌జేసీˆ ప్రిన్సిపల్, రైల్వే, పాలిటెక్నిక్‌ అధ్యాపకుడు, ఐటీ, ఎస్సై, నేవీ, గ్రామ సచివాలయ ఉద్యోగులు 3, సాఫ్ట్‌వేరు ఇంజినీర్లుగా నలుగురు ఇలా వివిధ ఉద్యోగాలు సాధించారు. ఆగస్టు 1వ తేదీన విడుదలైన కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి కానిస్టేబుల్‌గా ఎంపికకావడం విశేషం. గత నెల రోజుల కిందట దాదాపు 10 మందికి పైగా డీఎస్సీ పరీక్షలు రాశారు. కొత్తగా మరో పదిమంది ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.