
భారత సైన్యం, సిఆర్‌పిఎఫ్, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్ ఫలితంగా పహల్గామ్‌లో నిరాయుధులైన పర్యాటకులపై జరిగిన క్రూరమైన దాడికి కారణమైన ఉగ్రవాదులను నిర్మూలించగలిగామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభకు తెలియజేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా ఆయన అభివర్ణించారు.
ఏప్రిల్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఇషానీ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ సత్పతి భార్య ప్రియదర్శిని ఆచార్య, ఈ సంఘటనలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన “ఆపరేషన్ మహాదేవ్” విజయవంతంగా అమలు చేయడాన్ని స్వాగతించారు.
ఈ వార్తపై పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఒడిశాలోని బాలాసోర జిల్లాలోని ఇషానీ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ సత్పతి భార్య ప్రియదర్శిని స్పందించారు..ముగ్గురు ఉగ్రవాదులను బట్టుబెట్టడం అనేది మాకు మన:శాంతిని చేకూర్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాక భారత ఆర్మీ పట్ల గర్వంగా ఉందని ఆమె చెప్పారు. . “నా భర్త ఎప్పటికీ తిరిగి రాకపోయినా, అతని ఆత్మ చివరకు శాంతించిందని నేను నమ్ముతున్నాను. నా భర్త దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు, ఇప్పుడు న్యాయం జరిగింది. భారత సైన్యం , మన ప్రభుత్వం వారి వాగ్దానాన్ని నెరవేర్చాయి” అని ఆమె అన్నారు.
తన కుటుంబానికి, హింసకు గురైన అనేక మందికి న్యాయం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత భద్రతా దళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దాడి జరిగినప్పటి నుండి ఆయా కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన చెందుతన్నాయని, అందులో మేము కూడా ఒకరం అని చెప్పారు. “గత మూడు నెలలుగా, మేము బాధ మ, అనిశ్చితితో జీవించాము. దోషులు ఎప్పుడైనా పట్టుబడతారా అని నేను అనుకునేదాన్ని కానీ భారత్ ఇప్పుడు వారిని కాల్చేసింది. శత్రుదేశానికి ఇది బలమైన సంకేతం” అని ఆమె అన్నారు.. “ఇది నా కుటుంబానికి మాత్రమే కాదు, ఉగ్రవాదం కారణంగా నష్టపోయిన అనేక మంది ఇతరులకు కూడా న్యాయం” అని ఆమె అన్నారు.
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగాలని, ఆపరేషన్ సిందూర్ వంటి ప్రచారాలు ముగియకూడదని ఆమె పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను ఎవరైనా గుర్తుపట్టారా అని అడిగినప్పుడు, దాడికి ముందు ఆ ప్రాంతంలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని, కానీ భద్రతా సిబ్బందిగా పొరబడ్డారని ప్రియదర్శిని వెల్లడించింది. “ఈ ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా దృఢంగా వ్యవహరిస్తుందని నేను నమ్ముతున్నాను” అని పేర్కొంటూ, ఉగ్రవాదంపై ప్రభుత్వం తన నిర్ణయాత్మక వైఖరిని కొనసాగించాలని బలమైన విజ్ఞప్తి చేసింది.





