News

హిందువుల భావాలను దెబ్బతీస్తూ , దేవాలయాన్ని కూల్చేసిన డీఎంకే సర్కార్

187views

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం హిందూ ధర్మంపై తన పాశవిక దాడిని కొనసాగిస్తూనే వుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ డీఎంకే విధానాలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఉపన్యాసాలన్నీ కూడా హిందూ వ్యతిరేకతతో వున్నవే. అలాగే అక్కడి ఆలయాలపై కూడా స్టాలిన్ సర్కార్ అంతే పాశవికంగా వ్యవహరిస్తూనే వుంది.

తాజాగా… డీఎంకే ప్రభుత్వం రాత్రికి రాత్రే హిందూ దేవాలయాలన్ని కూల్చేసింది. చెన్నైలోని మింట్ స్ట్రీట్ లో వున్న దశాబ్దాల నాటి ‘‘వేద వినాయగర్’’ ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చేసింది. దీనిపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మున్నాని వంటి హిందూ గ్రూపుల నుంచి నిరంతరం వ్యతిరేకత వ్యక్తమవుతూనే వుంది. అయినా సరే.. స్టాలిన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోకుండా.. స్టాలిన్ హిందూ సంప్రదాయాలను, దేవాలయాలను టార్గెట్ చేస్తూనే వుంది.

హిందూ మున్నాని, స్థానిక హిందువుల కథనం ప్రకారం చిన్న కడంగమల్ ఆలయానికి సమీపంలో వున్న వేద వినాయగర్ ఆలయం 1955 నుంచే వుంది. క్రమం తప్పకుండా పూజాదికాలు కూడా జరుగుతున్నాయి. మొదట్ట వీఎన్ దేవయాని అమ్మాళ్ అర్చన నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. ఈమె మరణం తర్వాత ఆలయ పర్యవేక్షణకు ఇంద్రకుమార్ అనే వ్యక్తిని నియమించారు. ఈయన దేవాలయ నిర్వాహణ సరిగ్గా చేయడం లేదని, ఆస్తుల పరిరక్షణ సరిగ్గా చేయడం లేదని హిందూ మున్నాని ఆరోపిస్తూనే వుంది.

ఈ నెల 7 న హిందూ మున్నాని దేవాలయ కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ట్వీట్ కూడా చేసింది. దేవాలయ కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆలయం మాది, ఆస్తులు మావే అని చెప్పుకునే వారు ఈ పనిచేశారు. ఈ చర్యను ఖండిస్తున్నాం.’’ అని పేర్కొంది.

ప్రజల మనోభావాలు, సంప్రదాయాలు,విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చేశారని హిందూ మున్నాని పేర్కొంది. అయినా హిందువులు తమ నిరసనను శాంతియుతంగానే నిర్వహించారు. అయినా సరే హిందూ మున్నాని ప్రతినిధులతో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు.

తమిళనాడు ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే కూల్చివేస్తున్నారని, వాటినే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇతర వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలను మాత్రం ముట్టుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంఘటనే జరిగింది.

ద్రావిడ నమూనా పాలనను కొనసాగిస్తున్న డీఎంకే పాలనలో దాదాపు 250 కి పైగా హిందూ దేవాలయాలు కూల్చేశారని హిందువుల ఆరోపణ. అంతేకాకుండా దర్శనానికి అధిక రుసుములు విధించడం, ఆస్తుల పరాయీకరణ, ఆలయ నిధుల మళ్లింపు, దుర్వినియోగం కూడా జరుగుతోందని హిందువులు మండిపడుతున్నారు.

తెన్ కాశీ ప్రాంతంలో కూడా తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తెన్ కాశీ జిల్లాలోని పావూర్చత్రంలో ఓ వృద్ధుడు నిరసనకు దిగాడు. కుట్రల నాథర్ ఆలయానికి చెందిన భూమిలో చర్చి నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ రోడ్డుపైనే నిద్రించాడు.