
దామోహ్‌లోని ఓ శివాలయం ముందు ఉన్న మాంసం దుకాణం మూసివేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్న యువకుడిని కారుతో గుద్ది చంపేశారు.. వివరాల్లోకి వెళితే పవిత్ర శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఉత్తరాదిలో ప్రముఖంగా కవాడ్ యాత్ర మార్గంలో ఉన్న మాంసాహార దుకాణాలను మూసేస్తున్నారు. ఇదిలా ఉండగానే మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నుండి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది, శివాలయం ముందు మాంసాహార దుకాణాన్ని వ్యతిరేకించినందుకు ఒక యువకుడిని కారుతో ఢీకొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు శాంతిభద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సంఘటనపై మృతుడు తల్లి నన్నీ బాయి మాట్లాడుతూ, తన కుమారుడు రాకేష్, ఆమెని పఠానీ మొహల్లా ప్రాంతంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నప్పుడు, అజ్మేరీ గార్డెన్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అతనిపైకి దూసుకెళ్లిందని చెప్పింది. “నేను తృటిలో తప్పించుకున్నాను కానీ రాకేష్ అక్కడికక్కడే మరణించాడు. రాకేష్‌ను ఢీకొట్టి కారు పారిపోయింది.” అని చెప్పింది. ఇక ఈ విషయం బయటకి రాగానే , కారు నడుపుతున్న యువకుడు అదే ప్రాంతంలో నివసించే అకీల్ ఖాన్ అని తేలింది. అకీల్ తండ్రి నాసిర్ ఖాన్ సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్నాడని, అకీల్‌కు, తాను చంపాల్సిన వ్యక్తి ఇతనే అని సైగల ద్వారా చెప్పాడని, ఆపై అకీల్ వేగంగా కారు నడుపుతూ ఈ సంఘటన చేశాడని ఆమె చెప్పింది.
ఆలయం ముందు మాంసం అమ్ముతున్నారు.
దీనిపై మృతుడు రాకేష్ సోదరుడు బబ్లు మాట్లాడుతూ, పఠానీ మొహల్లాకు ఆనుకుని అజ్మేరీ గార్డెన్ సమీపంలో ప్రసిద్ధ హజారీ కి తలైయా ఉందని చెప్పాడు. ఈ చెరువు పక్కనే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పురాతన శివాలయం ఉంది, అక్కడికి ప్రజలు భక్తితో వెళతారు. కొన్ని సంవత్సరాల క్రితం, అకీల్, అతని తండ్రి ఆలయ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించి ఇల్లు నిర్మించారు. అయితే, దాదాపు మూడు సంవత్సరాలుగా, నాసిర్ , అకీల్ ఆలయం ముందు నాన్-వెజ్ షాపును ఏర్పాటు చేశారు. వారు ఆలయం ముందు మాంసం అమ్ముతున్నారు. ఇది స్థానిక ప్రజలు దీనిని వ్యతిరేకించారు. వారి నిరసనకు మృతుడు రాకేష్ రైక్వార్ నాయకత్వం వహించారు. శుక్రవారం ఉదయం ఈ విషయంలో రాకేష్ ,నాసిర్ మధ్య వివాదం జరిగింది . ఆ తర్వాత ఆరోజు సాయంత్రం ఆలస్యంగా, అతని కుమారుడు అకీల్ , నాసిర్ కారుతో రాకేష్ ను ఢీకొట్టి చంపేశాడు.
హత్య జరిగిందని తేలడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తతతలను అదుపులోకి తీసుకురావడానికి, పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ సుజిత్ భదౌడియా చెప్పినదాని, కారు ఢీకొన్న కేసులో, పోలీసులు సమీపంలోని సీసీటీవీలను శోధించగా, ఇది ప్రమాదం కాదని, హత్య అని తేలింది. మృతుడి తల్లి నివేదిక మేరకు, అకీల్ . అతని తండ్రి నాసిర్ ఖాన్‌పై హత్య కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. శివాలయం దగ్గర మాంసం అమ్మకాలను వ్యతిరేకించడమే హత్యకు కారణమని కూడా వెల్లడవుతున్నట్లు ఏఎస్పీ భదౌరియా తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఆలయం దగ్గర ఉన్న దుకాణాన్ని తొలగించి, అక్రమ నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభించబడింది.





