News

ధర్మాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి

371views

మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస శివాలయం ఆవరణలో నవగ్రహ విగ్రహాల ధ్వంసం ఘటనా ప్రదేశాన్ని రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసా నంద సరస్వతితో కలిసి పరిశీలించారు. ధర్మాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. దేవాలయాలపై ఇటువంటి ఘటనలను సాధుపరిషత్‌ ఖండిస్తుందని శ్రీనివా సానంద అన్నారు. కార్యక్రమంలో నాయ కులు కుమరాపు రవికుమార్‌, అప్పన్న, కూర్మారావు, ఆదినారాయణ జగన్నాథరావు పాల్గొన్నారు.