
త్రిపురలోని టాటుఅటిల్లాలోని మాతా శీతల మందిరాన్ని ఇస్లాం ఛాందసులు ధ్వంసం చేశారు. సరిగ్గా దేవాలయ అర్చన సమయంలోనే ఇస్లాంవాదులు ఆజాన్ చేయడంతో ఘర్షణ రేగింది. మందిరాన్ని ఇస్లాంవాదులు అపవిత్రం చేశారని, దేవతా విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయని హిందువులు మండిపడుతున్నారు. కావాలనే వాతావరణాన్ని చెడగొట్టాలని, తాము పూజలు చేస్తున్న సమయంలోనే ఇలా చేశారని హిందువులు వాదిస్తున్నారు.
అయితే స్థానిక హిందువుల ప్రకారం చాలా రోజులుగా ఇస్లాంవాదులు ఉద్రిక్తత రేకెత్తిస్తూనే వున్నారని, తాము అర్చనలు, పూజలు చేస్తున్న సమయంలోనే అభ్యంతరాలు తెలుపుతున్నారని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అజాన్ కూడా విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు.
అయినా సరే హిందువులు ఓపికగానే వున్నట్లు సమాచారం. ఎప్పుడైతే శీతలా దేవి మందిరాన్ని అపవిత్రం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేశారో హిందువులు తీవ్ర ఆగ్రహోద్రిక్తులు అయ్యారు. అధికారులు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముస్లిం ఛాందసులు కావాలనే హిందూ విశ్వాసాలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
హిందువులు మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల వల్లే సమస్యలు వస్తున్నాయని కూడా హిందువులు అంటున్నారు. వారివల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అయితే.. ఈ ప్రాంతంలో ఇలాంటి ఉద్రిక్తతలు కొత్తేమీ కాదని అంటున్నారు. గతంలోనే ఓ హిందూ మందిరం విధ్వంసం అయ్యిందని, కానీ అది ప్రచారంలోకి రాలేదన్నది స్థానికుల చెబుతున్న సమాచారం.
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ఇంత జరుగుతున్నా.. హిందూ విశ్వాసాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్థానికులెవరో, స్థానికేతరులెవరో వెంటనే గుర్తించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విధ్వంసకరమైన చర్యలను వెంటనే ఆగేలా చర్యలు తీసుకోవాలని, హింసను నివారించి, శాంతియుత వాతావరణాన్ని నిర్మించాలని హిందువులు సూచిస్తున్నారు.





