
279views
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్ల విషయంలో నకిలీ వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది. వైష్ణవ యాత్రాస్ పేరుతో ఓ వ్యక్తి ఫేస్‌బుక్ పేజీ నిర్వహిస్తూ స్వామి వారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేస్తున్నారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని టిటిడి తెలిపింది. ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్‌సైట్‌లను నమ్మి మోసపోవద్దని.. టికెట్లను తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించింది. దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.





