News

సనాతన్ వారియర్ అవార్డు

170views

ఉత్తరప్రదేశ్ వారణాసి జైత్‌పురా ప్రాంతానికి చెందిన ‘ఆల్ ఇండియా సనాతన్ ట్రస్ట్’ జూన్ 1 నుండి 9 వరకు శ్రీరామ కథను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా కృషి చేసిన హిందుత్వ భక్తులకు ‘సనాతన్ వారియర్ అవార్డు’ అందజేసి సత్కరించారు. ఇందులోభాగంగా వారణాసిలోని హిందూ జనజాగృతి సమితికి చెందిన శ్రీ రాజన్ కేసరి జగద్గురు పాతాళపురి పీఠాధీశ్వరుడు అనంత్ శ్రీ విభూషిత్ శ్రీమద్ జగద్గురు నరహరియానంద ద్వారాచార్య శ్రీ బాలక్‌దేవాచార్య మహరాజ్‌జీ (కాశీ) చేతుల మీదుగా ‘సనాతన్ వారియర్ అవార్డు’ అందజేసి సత్కరించారు. ఈ అవార్డును అందుకున్నందుకు శ్రీ రాజన్ కేసరి కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీరామ కథ ప్రారంభోత్సవ సమయంలో, సనాతన సంస్థకు చెందిన శ్రీమతి ప్రాచి జువేకర్ ‘సనాతన రాష్ట్ర శంఖనాద్ మహోత్సవం’ గురించి, అలాగే ‘జీవితంలో సాధన మరియు ధర్మచరణ ఆవశ్యకత’ గురించి అక్కడ ఉన్న భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ జైస్వాల్, ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేష్ సేథ్, కోశాధికారి శ్రీ జైశంకర్ ప్రసాద్ గుప్తా, పూజ కార్యదర్శి శ్రీ రవి ప్రకాష్ జైస్వాల్ మరియు ఇతర పౌరులు పాల్గొన్నారు.