News

జంతువుల్ని చంపినట్టు హిందువులను చంపుతానన్న సన్నీమియాభాయ్

179views

పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుండి, అస్సాంలో హిందువులపై ఇస్లామిస్టుల సోషల్ మీడియా ద్వేషం విపరీతంగా పెరిగింది. హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమే కాకుండా, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గానూ అక్కడ ఇస్లామిస్ట్ యూట్యూబర్ సన్నిమియా భాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జూన్ 4న అస్సాంలోని నాగావ్ జిల్లా నుండి సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో కలకలం రేపింది. సన్నీ మియా భాయ్ అనే వ్యక్తి హిందూ సమాజ సభ్యులను “మేకలు, ఆవుల మాదిరిగా” చంపుతానని బహిరంగంగా బెదిరించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో త్వరగా వైరల్‌గా మారి ప్రజలలో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. సన్నీ మియా భాయ్’ కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4K ఫాలోవర్లు ఉన్నారు. అందులో పోస్ట్ చేసిన ఆ వీడియోలో సన్నీమియా “మీకు (హిందువులకు) మియాలు ఎవరో తెలియదు. మాకు భయం లేదు. ప్రతి సంవత్సరం మేము బక్రీ ఈద్ జరుపుకుంటాము. ఖుర్బానీలో లాగా మేకలు, ఆవుల వలె మేము మిమ్మల్ని నరికివేస్తాము.” అన్నాడు.

ఈ వీడియోను కేవలం 2000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ఈ ఇస్లామిస్ట్ సన్నీ మియా పోస్ట్ చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ వీడియో తక్కువ వ్యవధిలోనే 44,000 కంటే ఎక్కువ లైక్స్ పొందింది. అతను పెట్టిన పోస్ట్ రెచ్చగొట్టేవిధంగా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నందున ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నెటిజన్లు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

వీడియో వైరల్ అయిన తర్వాత అతనిపై అనేక ఫిర్యాదులు అందడంతో అస్నాం పోలీసులు కూడా సీరియస్ గా తసుకుని నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు. సన్నీ మియాను నాగావ్ జిల్లాలోని అతని నివాసం నుండి అరెస్టు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరిత బెదిరింపులతో పాటుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా హింసను ప్రేరేపించడం వంటి BNS వివిధ విభాగాల కింద అతన్ని అరెస్టు చేశారు. వీడియో వెనుక ఏదైనా విస్తృత నెట్‌వర్క్‌లు లేదా ఉద్దేశ్యాలు ఉన్నాయా… అని నిర్ధారించడానికి ప్రస్తుతం అతనిపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ తీవ్రవాదం, ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత రెచ్చగొట్టే వార్తలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని తమ ప్రభుత్వం దృఢ వైఖరిని పునరుద్ఘాటించారు. “ద్వేషపూరిత ప్రసంగం అయినా, మతపరంగా రెచ్చగొట్టడం అయినా లేదా ప్రాణాలకు ముప్పు కలిగించినా – అస్సాం పోలీసులు ఎవరినీ విడిచిపెట్టరు, మతం లేదా సమాజంతో సంబంధం లేకుండా” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. “భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికీ హింసను ప్రేరేపించే లేదా మతపరమైన భావాలను అవమానించే హక్కును ఇవ్వదు.” సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ద్వేషాన్ని లేదా హింసను వ్యాప్తి చేసే కంటెంట్‌ను తొలగించాలని ఆయన కోరారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత అస్సాం పోలీసులు భారత సైన్యానికి కాకుండా పాకిస్తాన్‌కు మద్దతునిస్తు ద్వేషపూరిత పోస్టులు చేసిన దాదాపు 92 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో హిందూ సమాజంపై ఇస్లామిస్టుల ద్వేషం పెరుగుతున్నది, ఇది రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా మారనుంది.