News

త్వరలో గో మహా రథయాత్ర

270views

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, కేంద్రం వెంటనే దీనిపై నిర్ణయం వెల్లడించాలని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం సమీపంలోని జాఫర్‌గూడ యుగ తులసి గో మహాక్షేత్రంలో ఆయన మాట్లాడారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం, చేసిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే ఆమోదించాలన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్‌తో త్వరలో గో మహా రథయాత్రకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధి వరకు ఈ రథయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.