News

అమృత్ సర్ లో బాంబు పేలుడు.. అనుమానిత ఉగ్రవాద మృతి

214views

పంజాబ్ లోని అమృత్ సర్ లో బాంబు పేలుడు జరిగింది. బైపాస్ కి సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సమయంలోనే బాంబు అతడి చేతిలోనే పేలిపోయింది. దీంతో ఆ వ్యక్తి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. చనిపోయింది అనుమానిత ఉగ్రవాదే అని అంటున్నారు.నిషేధిత బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థకి చెందిన వాడిగా పోలీసులు అంటున్నారు.అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిశీలన చేశారు.ఉగ్రవాద కుట్రలో భాగంగానే బాంబు పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయా? లేక ఇంకో కోణం వుందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. అయితే ఈ స్థలంలో జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.