
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఆర్థిక జిహాద్… ఇవన్నీ వింటూ వస్తున్నాం కదా… ఇప్పుడు మరో కొత్తరకం జిహాద్ తెరపైకి వచ్చింది. అదే ‘‘పనీర్ జిహాద్’’. యూపీలోని గోరఖ్ పూర్ కేంద్రంగా ఈ పనీర్ జిహాద్ నడుస్తోంది. కల్తీ పన్నీర్ అమ్మడం ద్వారా మహ్మద్ ఖలీద్ అనే వ్యక్తి నెలకు 42 లక్షలు సంపాదిస్తున్నారు. పూర్తి విషపూరితమైన, రసాయనాలతో కూడిన ఓ పనీర్ ఫ్యాక్టరీని కూడా నడుపుతున్నాడు. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ గ్రడ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడం ద్వారా చివరకు మరణానికి కారణమైన రసాయనాలతో ఈ పనీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు తేల్చేశారు. దీంతో అధికారులు ఈ ఫ్యాక్టరీని మూసేశారు.
కేవలం ఈ ఫ్యాక్టరీ ద్వారా విష పూరిత రసాయనాలతో పనీర్ తయారు చేయడమే కాకుండా జిల్లాలో దీని విక్రయాల కోసం కొందరు ఏజెంట్లను కూడా నియుక్తి చేసుకున్నాడు మహ్మద్ ఖలీద్. ఖుషీనగర్, మహారాజ్ గంజ్, సంత్ కబీర్ నగర్, డియోరియా వంటి సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నెట్ వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే.. ఈ నకిలీ పనీర్ తయారీ కోసం మహ్మద్ ఖలీద్ ఉపయోగించే విష పదార్థాలను చూసి సీనియర్ అధికారులే ఆశ్చర్యపోయారు. వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. పోస్టర్ రంగులు, ఫ్యాబ్రిక్ వైట్ నర్, డిటర్జెంట్, పామాయిల్, సోప్ నట్స్, సాచరిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ తో పాటు మరికొన్ని విషపూరిత పదార్థాలను కూడా వాడుతున్నాడు. ఇంత విష పదార్థాలతో తయారు చేసినా.. అది అచ్చు పనీర్ లాగే వచ్చేది. ఈ మోసాన్ని ఏ కోశానా అనుమానించడానికి, గుర్తు పట్టడానికే వీలు లేకుండా తయారు చేశాడు.ఖలీద్ మరియు అతని బృందం సాంకేతిక నైపుణ్యంతో అక్రమ యూనిట్‌ను నడపడానికి హర్యానా నుండి కార్మికులను తీసుకువచ్చినట్లు కూడా తెలుస్తోంది.
అయితే దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఆహార కల్తీ కేసు మాత్రమే కాదని, ఓ క్రమబద్ధమైన, వ్యవస్థీకృతమైన బహిరంగంగా విషప్రయోగమని అన్నారు. ప్రజా రోగ్యానికి శత్రువులని, అలాంటి వారిపై ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ విషపూరిత పనీర్ అను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే ధ్వంసం చేసేశారు. ఈ కర్మాగారాన్ని వెంటనే సీజ్ చేసి, ఖలీద్ పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.





