News

పాక్ భక్తులు ఎందరో!

292views

భారతదేశంలో, అందునా ఉత్తరప్రదేశ్లో ఇంతటి పాకిస్తాన్ భక్తులు ఉన్నారా? ఉన్నారని చెప్పక తప్పడం లేదు. ఆ రాష్ట్రంలోని షహరన్ పూర్ ఒక హైస్కూలు బాలిక ప్రదర్శించిన చేష్ట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్లాస్ 11 చదువుతున్న ఒక బాలిక స్కూటీ మీద ఇంటికి వెళుతుండగా రోడ్డు మీద పాకిస్తాన్ చెండాలు అతికించి ఉండడం గమనించింది. వెంటనే స్కూటీ ఆపి ఆ జెండాలను తొలగించే ప్రయత్నం చేసింది. పెహల్గావ్లో ఉగ్రవాద దాడికి నిరసనగా కొందరు పాకిస్తాన్ జెండాల నమూనాలను అలా రోడ్డు మీద అతికించారు. ఈ దృశ్యం వైరల్ కాగానే కొందరు ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి బహిష్కరించవలసిందిగా కోరారు. స్కూలు యాజమాన్యం వెంటనే ఆమెను బహిష్కరించింది.