News

గుంటూరులో గుడిని కూల్చిన మున్సిపల్ అధికారులు

1.2kviews

నుమతి లేదనే కారణంతో గుంటూరులో బస్టాండ్ వెనక రైతు బజారు వద్ద గల కనకదుర్గమ్మ గుడిని అధికారులు అకస్మాత్తుగా పడగొట్టారు.  దీంతో ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా గుడిని కూల్చటం ఏమిటని అధికారులపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అత్యంత అవమానకర రీతిలో గుడిని కూల్చివేశారని, ఇప్పటికిప్పుడు అంత అర్జంటుగా గుడిని కూల్చవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అంతే కాక గుడిని కూల్చటానికి వాడిన JCB పై శిలువ గుర్తు కనిపిస్తూండడంతో అధికారులు క్రైస్తవ మత మార్పిడి ముఠాలతో కలిసి కావాలనే హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి దేవాలయం కూల్చివేతపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.