News

రాష్ట్రంలోని పాకిస్థానీయులు 27 లోపు దేశం విడిచి వెళ్లిపోవాలి

297views

రాష్ట్రంలో ఉన్న పాకిస్థాన్‌ పౌరులు ఈ నెల 27లోపు, వైద్యసేవల నిమిత్తం మెడికల్‌ వీసా మీద వచ్చినవారు 29వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్థాన్‌ జాతీయులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో వారు ఎక్కడెక్కడున్నారో గుర్తించి పాకిస్థాన్‌ పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.