News

హిందువులంతా ఐక్యంగా ఉండాలి

341views

హిందువుల ఐక్యత.. దేశానికి శ్రీరామరక్ష అని శ్రీశైవక్షేత్ర పీఠాధి పతి శివస్వామి అన్నారు. కశ్మీర్ లో హిందువులపై దాడిని నిరసిస్తూ బుధవారం సాయంత్రం హిందూ ఐకాస ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ ఘటన దుర్మార్గమని, కొన్ని రాజకీయ పార్టీలకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. హిందువులపై ఇస్లామిక్ జాతి అనేక దాడులు చేస్తూనే ఉందని, వారిపై ఎదురుదాడి చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఐకాస నాయకుడు నాగలింగం శివాజీ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆధ్యా త్మికవేత్త వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి కులం, మతం లేదని.. ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ముప్పు పొంచి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాస నాయకులు అవుటుపల్లి శశి వరప్రసాద్, రాఘవరాజు, కృష్ణభగవాన్, చక్రధర్, కె. శ్రీనివాస్, దుర్గాప్రసాద్, మంచి రవి తదితరులు పాల్గొన్నారు.