
2013 వక్ఫ్ సవరణ బిల్లు!
UPA 2 ప్రభుత్వం 2013 లో వక్ఫ్ సవరణ బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టింది! నిజానికి 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ May 7,2010 లో బిల్లు పెట్టింది. రాజ్యసభ ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీ కి పంపింది. సెలెక్ట్ కమిటీ కొన్ని సూచనలు, సవరణలు రికమెండ్ చేసింది!
ఆ బిల్లునే 2013 లో లోక్ సభలో ప్రవేశపెట్టింది UPA 2 ప్రభుత్వం! ఆ బిల్లు సభ ఆమోదం పొందింది!
1995 వక్ఫ్ బిల్లు లో ఉన్న చాలా సెక్షన్ల మార్పుతో 2013 బిల్లు అమలులోకి వచ్చింది.
సెక్షన్ 52 వక్ఫ్ యాక్ట్ ప్రకారం వక్ఫ్ ఆస్థిని ఎవరన్నా ఆక్రమించినా మరియు కొనుగోలు చేసినా రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది!
గుడి మాణ్యాలు ఎంచక్కా ఆక్రమించేసి అమ్ముకోవచ్చు అన్నమాట!
2013 వక్ఫ్ బిల్లులో 108A ని చేర్చారు! సెక్షన్ 108A లో ఏముంది? వక్ఫ్ ఆస్థుల విషయంలో ఏదన్నా ఆస్థిర పరిస్థితులు ఇతర రెవెన్యూ చట్టాల వల్ల కలిగితే ఆ చట్టాలు వక్ఫ్ చట్టం ముందు తల వంచాల్సిందే! అంటే రెవెన్యూ లేదా ఎండోమెంట్ చట్టాలతో వక్ఫ్ చట్టం లోని అంశాలు కన్ఫ్లిక్ట్ అయితే వక్ఫ్ చట్టమే అమలవుతుంది తప్పితే రెవెన్యూ చట్టం కాదు! భేష్!
2013 వక్ఫ్ సవరణ చట్టం ఒక కుట్ర!
2013 వక్ఫ్ సవరణ అనేది ఒక పధకం ప్రకారం కుట్రతో చేసినదే!
2013 లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొంది చట్టం అయిన కొద్ది రోజులకే అంటే 2014 ఎన్నికలకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ లో ఉన్న 123 ఆస్తులని చాలా తెలివిగా వక్ఫ్ కి కట్టబెట్టింది!
123 ఆస్థులు అంటే ఏమిటీ?
2014 ఎన్నికలకి ముందు అంటే మార్చి 2 వ తారీఖు 2014 న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ లో ఉన్న 123 ఆస్తులని డీ నోటిఫై చేసింది అంటే ఆ 123 ఆస్తులని రికార్థులనుండి తొలగించింది. అవి….పార్లమెంట్ భవనం, CGO ( Central Government Offices Complex ), కన్నాట్ ప్లేస్ మొత్తం, అశోకా రోడ్ మొత్తం,బాబర్ రోడ్ మొత్తం, లోఢీ రోడ్ మొత్తం,మధుర రోడ్ మొత్తం, పండారా రోడ్ మొత్తం, దర్యా గంజ్, కరోల్ బాగ్ లు ఉన్నాయి. 123 ఆస్తులలో ఇవి కొన్ని మాత్రమే!. ఢిల్లీ గురుంచి తెలిసినవాళ్లకి ఎవరికైనా అర్ధమవుతుంది పైన పేర్కొన్న ప్రదేశాలు ఎంత విలువైనవో మరియు కీలకమైనవో! ఢిల్లీ వక్ఫ్ బోర్డు పైన పేర్కొన్న 123 ఆస్థులు తమవే అని 1970 లోనే క్లెయిమ్ చేసింది! ఇన్నాళ్ళు ఢిల్లీ ల్యూటేన్ మీడియా ఎందుకు కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నదో తెలుసా? జస్ట్ పైన పేర్కొన్న ఆస్తులే కాకుండా మిగతా వాటిని ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి అప్పగిస్తే అప్పుడు తమ నివాసాలాని, ఆఫీసులని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఒక సారి వక్ఫ్ కిందకి వెళ్ళిపోతే చాలా తక్కువ ధరకి లీజుకి తీసుకోవచ్చు అన్నమాట!
ఓహ్! తక్కువ ధరకి లీజు అంటే ఒక విషయం చెప్పాలి!
బెంగుళూరు – విండ్సర్ మానర్ హోటల్ ( Windsor Manor Hotel). ఈ హోటల్ లోనే పుష్పక విమానం సినిమా తీశారు!
మొత్తం 4 ఎకరాలలో ఉన్న విండ్సర్ మానర్ ఫైవ్ స్టార్ హోటల్ బెంగుళూరు వక్ఫ్ బోర్డు స్థలం!
1973-78 దాకా అంటే 5 ఏళ్ళకి హోటల్ యాజమాన్యం వక్ఫ్ బోర్డుకి చెల్లించిన లీజు అద్దె నెలకి 3,100 రూపాయలు మాత్రమే!
2013-18 వరకు అంటే అయిదేళ్ళకి నెలకి చెల్లించిన అద్దె 7,100/- మాత్రమే.
కారణాలు చెప్పకుండా బెంగుళూరు వక్ఫ్ బోర్డు 80 ఏళ్లకి విండ్సర్ మానర్ హోటల్ కి లీజుకి ఇచ్చింది. ప్రతీ ఐదు సంవత్సరాలకి ఒకసారి అద్దె ధరలని అప్పటి మార్కెట్ ని అనుసరించి సవరిస్తారు! మరీ దారుణం కాకపొతే బెంగుళూరు లో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న 4 ఎకరాల భూమికి నెలకి అద్దె 7,100 రూపాయలా?
అంటే ఈ లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు రహస్యంగా చేతులు మారి ఉండవచ్చు?
2012 లో అప్పటి కర్ణాటక మైనారిటి కమిషన్ చైర్మన్ అయిన అన్వార్ మణిప్పుడి కర్ణాటక వక్ఫ్ లో అవకతవకల మీద ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ లో కర్ణాటక వక్ఫ్ ఆస్తులు 57,000 ఎకరాల భూములకి సంబంధించి ఆక్రమణలు, తక్కువ ధరకి లీజుకి ఇవ్వడం, వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేయకుండా అమ్మడం లాంటి అవినీతి జరిగింది అని పేర్కొన్నాడు.
2013 నాటికే కర్ణాటక వక్ఫ్ అవినీతి విలువ 2.5 నుండి 13.5 లక్షల కోట్లు ఉండవచ్చు అని అంచనా! దీనిమీద లోకాయుక్త విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతవరకు దానిని బయటపెట్టలేదు!
విండ్సర్ మానర్ ఫైవ్ స్టార్ హోటల్ అద్దె అనేది చిన్న ఉదాహరణ మాత్రమే!
వక్ఫ్ ఉద్దేశ్యం ఏమిటంటే వక్ఫ్ ఆస్థుల మీద వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లిం ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి అని. కానీ అలా జరుగుతున్నదా?
కర్ణాటకలో రాజకీయ నాయకులు, వక్ఫ్ తో కుమ్ముక్కు అయి దోచుకుంటున్నారు. రాజకీయ నాయకులు లక్షల కోట్లలో దోచుకొని ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో 20% ముస్లిమ్స్ కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు!
Contd.. Part 3
జైహింద్!





