News

రాజధర్మాన్ని పాటించిన గొప్ప పాలకుడు శ్రీ శివాజీ మహారాజ్

462views

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 100 శాతం సెక్యులర్‌ పాలకుడు అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఎన్నో యుద్ధాల్లో ఆయన విజేతగా నిలిచినా.. ఒక్క మసీదును కూడా ధ్వంసం చేయలేదన్నారు. విశ్వాస్ పాటిల్ రాసిన ‘ది వైల్డ్ వార్‌ఫ్రంట్’ అనే పుస్తకం ఆంగ్ల అనువాద వెర్షన్‌ను దిల్లీలో కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర వెలుపలి ప్రజలకు శివాజీ మహారాజ్‌ గురించి కొన్ని అపోహలు ఉన్నాయన్నారు.

‘‘శివాజీ మహారాజ్‌ ఒక ఆదర్శవంతమైన పాలకుడు. ఆదర్శనీయుడైన ఓ తండ్రి. ఆయన 100శాతం సెక్యులర్‌. ఎన్నో యుద్ధాలను గెలిచినా గానీ ఒక్క మసీదునూ ఆయన ధ్వంసం చేయలేదు. పెద్ద పెద్ద నేతలు కూడా కులం, మతం గురించి మాట్లాడుతుండటం దురదృష్టకరం. కులం, మతం గురించి ఎవరూ మాట్లాడొద్దు’ అని గడ్కరీ అన్నారు.”ముఖ్యంగా తన చరిత్ర అంతటా, అతను అనేక యుద్ధాలను గెలిచాడు మరియు ఎప్పుడూ మసీదుపై దాడి చేయలేదు… అతను ఎల్లప్పుడూ మహిళల పట్ల గౌరవం చూపించాడు, ప్రజలకు అంకితమైన రాజు అని చెప్పారు.