
366views
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఆయన ఇక్కడ దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఈ యాత్రలో ఉజ్జయినీ(మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్), ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్, పుణే(భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రిష్ణేశ్వర్) సందర్శన ఉంటుందని వివరించారు. ఈ రైలు విజయవాడలో బయలుదేరి ఖమ్మం, కాజీపేట, హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఏప్రిల్ 8న బయలుదేరే ఈ రైలు 19న తిరిగి విజయవాడ చేరుతుందని చెప్పారు. ఈ రైలులో ఎకానమీ(స్లీపర్), స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) సౌకర్యాలు ఉంటాయన్నారు. వివరాలకు 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలన్నారు.





